Jagan: జగన్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన పలువురు ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు

  • తాడేపల్లి చేరుకున్న జగన్
  • ఈ నెల 30న జగన్ ప్రమాణ స్వీకారం
  • పలువురు కలెక్టర్లు, సబ్ కలెక్టర్లు జగన్‌తో భేటీ

ఢిల్లీ పర్యటన ముగించుకుని వైసీపీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నేడు తాడేపల్లిలోని తన నివాసానికి చేరుకున్నారు. ఈ నెల 30న ముఖ్యమంత్రిగా జగన్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ నేపథ్యంలో నేటి సాయంత్రం జగన్‌ను పలువురు సీనియర్ ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు మర్యాదపూర్వకంగా కలిశారు.

తూర్పు గోదావరి, విశాఖ, ప్రకాశం, చిత్తూరు జిల్లాల కలెక్టర్లు, సబ్ కలెక్టర్లు జగన్‌తో భేటీ అయ్యారు. అనంతరం సీనియర్ అధికారులు ఐజీ సంజయ్, వరప్రసాద్, లక్ష్మీకాంతం, కృష్ణబాబు, సంధ్యారాణి, సత్యనారాయణ జగన్‌ను కలిసిన వారిలో ఉన్నారు. అలాగే ఐపీఎస్ అధికారి స్టీఫెన్ రవీంద్ర, కలెక్టర్లు కార్తికేయ మిశ్రా, ప్రద్యుమ్న, కాటమనేని భాస్కర్, సత్యనారాయణతో పాటు ఎస్పీలు మేరీ ప్రశాంత్, రవిప్రకాశ్ తదితరులు జగన్‌ను కలిశారు.

Jagan
Stefen Ravindra
Sanjay
Vara Prasad
Lakshmi Kantham
Sandhya Rani
Satyanarayana
Karthikeya Misra
Pradyumna
  • Loading...

More Telugu News