BSE: కొత్త ప్రభుత్వం జోరులో దూసుకుపోతున్న మార్కెట్ సూచీలు
- ఐటీ, ఫార్మా మినహా మిగిలిన రంగాల్లో ఆశాజనక ట్రేడింగ్
- లాభాల్లో టాటా స్టీల్, యెస్ బ్యాంక్
- నష్టాలు చవిచూసిన రిలయన్స్ ఇండస్ట్రీస్, భారతీ ఎయిర్ టెల్
కేంద్రంలో మరోసారి ఎన్డీయే ప్రభుత్వం ఏర్పాటు కానున్న నేపథ్యంలో దేశీయ స్టాక్ మార్కెట్లు ఎలాంటి ఒడిదుడుకులు లేకుండా సాఫీగా సాగిపోతున్నాయి. ఎన్నికల ఫలితాలు వచ్చినప్పటినుంచి దూసుకుపోతున్న కీలక సూచీలు ఇవాళ కూడా అదే జోరు కనబర్చాయి. ఐటీ, ఫార్మా రంగాలను మినహాయించి మిగతా అన్ని రంగాల్లో ట్రేడింగ్ ఆశాజనకంగా సాగింది.
బీఎస్ఈ సెన్సెక్స్ 248 పాయింట్లు లాభపడి 39683 వద్ద స్థిరపడగా, 80 పాయింట్ల వృద్ధితో నిఫ్టీ 11,924 వద్ద ముగిసింది. టాటా స్టీల్, యెస్ బ్యాంక్, ఎన్టీపీసీ, ఐఓసీ, ఎల్ అండ్ టీ షేర్లు భారీగా లాభపడ్డాయి. జీ ఎంటర్టయిన్ మెంట్, ఇండస్ ఇండ్ బ్యాంక్, రిలయన్స్ ఇండస్ట్రీస్, టెక్ మహీంద్రా, భారతీ ఎయిర్ టెల్ షేర్లు నష్టాలు ఎదుర్కొన్నాయి.