Stefen Ravindra: ఐపీఎస్ స్టీఫెన్ రవీంద్రను మాకు ఇవ్వండి: జగన్ ప్రత్యేక విన్నపం

  • గతంలో వైఎస్ వద్ద పనిచేసిన స్టీఫెన్ రవీంద్ర
  • ప్రస్తుతం తెలంగాణలో విధులు
  • త్వరలోనే డిప్యుటేషన్ పై ఏపీకి

గతంలో వైఎస్ రాజశేఖరరెడ్డికి చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ గా పని చేసిన స్టీఫెన్ రవీంద్రే తన వద్దా పని చేయాలని జగన్ కోరుకుంటున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తరువాత స్టీఫెన్ రవీంద్ర తెలంగాణ రాష్ట్రానికి కేటాయించబడిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో స్టీఫెన్ ను ఏపీకి తీసుకోవాలని భావిస్తున్న జగన్, ఆయన్ను డిప్యుటేషన్ మీద తమ రాష్ట్రానికి పంపించాలని కోరారు.

ఈ మేరకు కేంద్ర హోమ్ శాఖకు ఆయన ప్రత్యేకంగా విన్నవించారు. అందుకు హోమ్ శాఖ సానుకూలంగా స్పందించిందని, ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్ గానూ ఆయన పేరు దాదాపు ఖరారైందని, ఒకటి, రెండు రోజుల్లోనే ఆయన విజయవాడకు వెళ్లి పరిస్థితిని సమీక్షిస్తారని తెలుస్తోంది. సీఎంగా జగన్ బాధ్యతలు చేపట్టిన వెంటనే ఇంటెలిజెన్స్ చీఫ్ బాధ్యతలను స్టీఫెన్ రవీంద్ర చేపట్టవచ్చని సమాచారం.

Stefen Ravindra
IPS
Jagan
Chief Security Officer
  • Loading...

More Telugu News