Jagan: జగన్ లో ఆ కసి ఎందుకో తెలుసా?: స్వరూపానందేంద్ర సరస్వతి

  • తండ్రిని మించి ప్రజల్లోకి చొచ్చుకుపోవాలన్నది జగన్ తపన
  • సమాజంలో తన పేరు చిరస్థాయిగా ఉండాలని కోరుకుంటారు
  • జగన్ ఆ స్థాయికి చేరతాడని నాకు నమ్మకం ఉంది

ఏపీ కాబోయే సీఎం జగన్ గురించి చెబుతూ ఆయన తండ్రి వైఎస్ ప్రస్తావన తీసుకొచ్చారు విశాఖ పీఠాధిపతి స్వామి స్వరూపానందేంద్ర సరస్వతి. జగన్ తండ్రి వైఎస్ అంటే తనకు ఎంతో అభిమానం అని, తాను ఆయన్ని ప్రాణంగా భావించేవాడ్నని, ఆయన కూడా తనను ఎంతో ఇష్టపడేవారని స్వామీజీ గుర్తుచేసుకున్నారు. ఆరోగ్యశ్రీ, ఫీజు రీయింబర్స్ మెంట్ వంటి పథకాలతో పేదలకు చేరువైన వైఎస్, చిన్నారుల నుంచి నిరుద్యోగుల వరకు ప్రతి ఒక్కరికీ ఏదో ఒక మేలు చేయాలని భావించేవాడని తెలిపారు.

ఇప్పుడు జగన్ కూడా తండ్రిని మించి ఏదో చేయాలని తపించిపోతున్నాడని వివరించారు. "సమాజంలో జగన్ అనే పేరు చిరస్థాయిగా ఉండాలి. తన తండ్రికి ప్రజల్లో ఎంత గుర్తింపు ఉందో అంతకంటే ఎక్కువగా తాను ప్రజల్లోకి చొచ్చుకుపోవాలని భావిస్తుంటారు. జగన్ లో అంత కసి ఉంది.  తండ్రి వైఎస్సార్ కంటే సుపరిపాలన అందించాలన్నది అతని లక్ష్యం" అని స్వరూపానందేంద్ర జగన్ గురించి చెప్పుకొచ్చారు. జగన్ ఆ స్థాయికి ఎదుగుతాడని తనకు సంపూర్ణంగా నమ్మకం ఉందని స్పష్టం చేశారు.

  • Loading...

More Telugu News