Jagan: నాడు కుడివైపున్న మొదటి అబ్బాయే... నేడు ఏపీ సీఎం!
- హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ లో చదివిన జగన్
- 1991లోనే హౌస్ కెప్టెన్ గా ఎంపిక
- వైరల్ అవుతున్న పాత చిత్రం
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తరువాత ఏర్పడిన రాష్ట్రానికి రెండో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్న వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, గతంలో హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ లో విద్యను అభ్యసించిన సంగతి తెలిసిందే. అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తరువాత, జగన్ చిన్నప్పటి ఫోటోలు ఎన్నో వైరల్ అవుతున్నాయి. అటువంటి వాటిల్లో ఒకటే ఇది. హెచ్పీఎస్ లో చదువుకుంటున్న వేళ, 1991లో తీసిన ఫోటో ఇది. ఇందులో మొదటి వరుసలో కుడివైపున్న మొదటి అబ్బాయే వైఎస్ జగన్. నాడు హెచ్పీఎస్ హౌస్ కెప్టెన్ గా జగన్ ను ఎన్నుకున్న అనంతరం తీసిన ఫోటో ఇది. ఈ ఫోటోను పోస్ట్ చేసిన జగన్ క్లాస్ మేట్స్, పుట్టుకతోనే జగన్ నేతని, అందుకు ఈ ఫోటోనే సాక్ష్యమని వ్యాఖ్యానిస్తున్నారు.

HPS House Captain to AP CM -- YS Jagan Anna born leader

CM వై.యస్ జగన్ మోహన్ రెడ్డి గారు హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ లో హౌస్ కెప్టెన్ గా సెలెక్ట్ అయినప్పటి ఫోటో. pic.twitter.com/nbH8FiYAIL
— RaviTeja (@teja238) May 26, 2019