Andhra Pradesh: అనంతపురంలో టెన్షన్ టెన్షన్.. వైఎస్ విగ్రహాన్ని ధ్వంసం చేసిన దుండగులు!

  • జిల్లాలోని గార్లెదిన్నె తలదాసిపల్లిలో ఘటన
  • 44వ జాతీయ రహదారిపై వైసీపీ ఆందోళన
  • పోలీసులు సముదాయించడంతో వెనక్కి తగ్గిన నేతలు

ఆంధ్రప్రదేశ్ లోని అనంతపురం జిల్లాలో ఈరోజు ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. జిల్లాలోని గార్లెదిన్నె మండలం తలదాసిపల్లిలో నిన్న అర్ధరాత్రి దాటాక కొందరు దుండగులు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహం తలను తొలగించారు. ఈరోజు దాన్ని గమనించిన వైసీపీ శ్రేణులు ఆందోళనకు దిగాయి.

తలదాసిపల్లి మీదుగా వెళుతున్న 44వ నంబర్ జాతీయ రహదారిపై వైసీపీ నేతలు, కార్యకర్తలు బైఠాయించారు. ఈ నేపథ్యంలో భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది. దీంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు, వైసీపీ నేతలతో చర్చించారు. దోషులపై కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. దీంతో ఆందోళన విరమించిన వైసీపీ శ్రేణులు పోలీసులకు ఫిర్యాదు అందించి వెనుదిరిగాయి.

Andhra Pradesh
Anantapur District
ysr statue
destroyed
Police
YSRCP
agitation
  • Loading...

More Telugu News