Varsha Sharma: మిస్సెస్ ఇండియా రన్నరప్ గా ఆదిలాబాద్ బ్యూటీ... సన్మానించిన జోగు రామన్న!

  • ఇటీవల ముంబైలో పోటీలు
  • ఫస్ట్ రన్నరప్ గా నిలిచిన వర్షా శర్మ
  • జిల్లాకే గర్వకారణమన్న జోగు రామన్న

ఇటీవల ముంబైలో జరిగిన మిస్సెస్ ఇండియా పోటీల్లో ఆదిలాబాద్ కు చెందిన వర్షా శర్మ రెండో స్థానంలో నిలిచి, శనివారం నాడు పట్టణానికి రాగా, ఎమ్మెల్యే జోగు రామన్న ఆమెను సత్కరించారు. మొత్తం 35 మందితో పోటీపడిన వర్ష, మొదటి రన్నరప్ గా నిలిచారు.

ఈ సందర్భంగా జోగు రామన్న మాట్లాడుతూ, వర్ష గెలుపు మొత్తం జిల్లాకు గర్వకారణమన్నారు. వర్షా శర్మ మాట్లాడుతూ, భవిష్యత్తులో జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో పోటీపడి జిల్లాకు మరింత ఖ్యాతిని తెస్తానని వెల్లడించారు. మహిళలు వంటింటికి పరిమితం కారాదని, ప్రయత్నిస్తే ఏ రంగంలోనైనా రాణించే సత్తా ఉన్నవారని అన్నారు.

Varsha Sharma
Adilabad
Misses India
Runnerup
Adilabad District
Jogu Ramanna
  • Loading...

More Telugu News