Gautam Sawaang: ఠాకూర్ ప్లేస్ లో గౌతమ్ సవాంగ్ ను ఎంచుకున్న జగన్!

  • 1986 ఐపీఎస్ బ్యాచ్ లో సవాంగ్
  • ఉమ్మడి ఏపీలో పలు ప్రాంతాల్లో విధులు
  • ప్రమాణ స్వీకార ఏర్పాట్ల బాధ్యత సవాంగ్ కే
  • డీజీపీగా త్వరలోనే ఉత్తర్వులు

ఏపీకి కొత్త డీజీపీగా దామోదర్ గౌతమ్ సవాంగ్ ను జగన్ ఎంచుకోనున్నట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం. ప్రస్తుతం డీజీపీగా ఆర్పీ ఠాకూర్ విధులు నిర్వర్తిస్తుండగా, ఆయన స్థానంలో విజిలెన్స్ ఎన్ ఫోర్స్ మెంట్ విభాగం డైరెక్టర్ జనరల్ గా విధుల్లో ఉన్న సవాంగ్ నియమితులు కానున్నారని అధికార వర్గాలు అంటున్నాయి. తన ప్రమాణ స్వీకారోత్సవానికి ఏర్పాట్లను పర్యవేక్షించే బాధ్యతలను సైతం గౌతమ్ సవాంగ్ కే జగన్ అప్పగించారు.

1986 బ్యాచ్ కి చెందిన సవాంగ్ 1963లో జన్మించారు. ఉమ్మడి ఏపీలో మదనపల్లి ఏఎస్పీగా ఉద్యోగ ప్రస్థానాన్ని ప్రారంభించి, ఆపై చిత్తూరు, వరంగల్ జిల్లాల్లో ఎస్పీగా, వరంగల్ రేంజ్, హోమ్ గార్డ్ డీఐజీగా, ఎస్ఐబీ, ఏపీఎస్పీ డీఐజీగానూ పనిచేశారు. డిప్యుటేషన్ పై మూడేళ్లపాటు లైబీరియాలో ఐరాస పోలీసు కమిషనర్ గానూ పనిచేశారు.

2015 నుంచి 2018 వరకూ విజయవాడ పోలీసు కమిషనర్ గా పనిచేసి తనదైన ముద్ర వేశారు. ఇక సవాంగ్ నియామకంపై త్వరలోనే ఉత్తర్వులు వెలువడతాయని తెలుస్తోంది. గత సంవత్సరం జులైలో డీజీపీగా బాధ్యతలు చేపట్టిన ఠాకూర్, గడచిన 11 నెలలుగా పదవిలో కొనసాగుతున్నారు. ఆయన స్థానంలో సవాంగ్ డీజీపీగా బాధ్యతలు చేపడతారని తెలుస్తోంది.

Gautam Sawaang
RP Thakur
Jagan
Andhra Pradesh
DGP
  • Loading...

More Telugu News