Narendra Modi: ముస్లిం దంపతులకు 23న జన్మించిన బాబు.. మోదీ పేరు పెట్టిన తల్లిదండ్రులు!

  • ఉత్తరప్రదేశ్‌లోని గోండాలో ఘటన
  • దుబాయ్‌లో ఉన్న భర్త సూచనతో కుమారుడికి మోదీ పేరు
  • మోదీలాగే తన కుమారుడు కూడా ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని ఆకాంక్ష

సార్వత్రిక ఎన్నికల ఫలితాలు విడుదలైన 23వ తేదీన పుట్టిన తమ బిడ్డకు మోదీ అని పేరు పెట్టుకున్నారు ఓ ముస్లిం దంపతులు. ఉత్తరప్రదేశ్‌లోని గోండాకు చెందిన మీనాజ్‌కు ఈ నెల 23న పండంటి మగ బిడ్డ జన్మించాడు. ఈ విషయాన్ని దుబాయ్‌లో ఉంటున్న భర్తకు ఫోన్ చేసి చెప్పింది. దీంతో ఎన్నికల్లో విజయం సాధించిన మోదీ పేరును తన కుమారుడికి పెట్టాలంటూ ఆయన చెప్పాడు. దీంతో ఆమె తన కుమారుడికి నరేంద్రమోదీ అని నామకరణం చేసింది. మోదీలాగే తన కుమారుడు కూడా ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని ఈ సందర్భంగా ఆమె తన బిడ్డను ఆశీర్వదించింది.

Narendra Modi
Uttar Pradesh
Newborn baby
Muslim couple
  • Loading...

More Telugu News