Jagan: విజయోత్సాహంతో లోటస్ పాండ్ లో అడుగుపెట్టిన జగన్
- గవర్నర్, కేసీఆర్ లతో భేటీ
- అభిమానుల అపూర్వ స్వాగతం
- లోటస్ పాండ్ లో భారీ జనసందోహం
కొన్నిరోజుల క్రితం వరకు విపక్షనేతగా ఉన్న జగన్ ఇవాళ సీఎం అవుతున్నాడన్న ఉత్సాహం వైసీపీ శ్రేణుల్లో అంబరాన్నంటుతోంది. ఇవాళ సాయంత్రం హైదరాబాద్ లోని లోటస్ పాండ్ వద్ద కనిపించిన దృశ్యం అందుకు అద్దం పడుతోంది. ఏపీ నుంచి హైదరాబాద్ వచ్చిన జగన్ గవర్నర్, సీఎం కేసీఆర్ లతో భేటీలు ముగించుకుని నేరుగా లోటస్ పాండ్ చేరుకున్నారు. కాబోయే సీఎం హోదాలో లోటస్ పాండ్ లో అడుగుపెట్టిన జగన్ కు అభిమానులు అపూర్వ స్వాగతం పలికారు. బాణసంచా కాల్పులతో తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు.
ఓ దశలో అభిమానుల తాకిడితో జగన్ వాహనం ముందుకు కదల్లేకపోయింది. భద్రత సిబ్బంది అతికష్టమ్మీద కారును ముందుకు తీసుకెళ్లగలిగారు. వాహనం దిగిన జగన్ అందరికీ వినమ్రంగా అభివాదం చేస్తూ ముందుకు కదిలారు. ఈ సందర్భంగా లోటస్ పాండ్ వద్ద జై జగన్, సీఎం సీఎం అంటూ నినాదాలు మిన్నంటాయి. చివరికి జగన్ ను లోపలికి తీసుకెళ్లేందుకు సెక్యూరిటీ సిబ్బంది అభిమానులను బలవంతంగా బయటికి పంపించాల్సి వచ్చింది.