MAA: నాగబాబు వల్లే ‘మా’లో మేము గెలిచామనడం కరెక్టు కాదు: జీవితా రాజశేఖర్

  • నాగబాబు వల్ల ఒక్క శాతం మేలు జరిగి ఉండొచ్చు
  • కానీ, ఆయన వల్లే గెలిచామనడం సరికాదు
  • ఇదంతా సామాజిక మాధ్యమాల సృష్టే

ఇటీవల జరిగిన మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా) ఎన్నికల్లో సీనియర్ నటుడు నరేశ్ ప్యానెల్ విజయం సాధించిన విషయం తెలిసిందే. అయితే, ఈ ప్యానెల్ విజయానికి కారణం ప్రముఖ నిర్మాత, నటుడు నాగబాబేనంటూ వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ‘మా’ జనరల్ సెక్రటరీ జీవితా రాజశేఖర్ స్పందించారు.

హైదరాబాద్ లో ఈ రోజు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ, నాగబాబు వల్ల ఒక్క శాతం మేలు జరిగి ఉండొచ్చు కానీ, ఆయన వల్లే గెలిచామనడం సరికాదని అన్నారు. తాము మంచి చేస్తామని, చేయగలమని నమ్మడం, దీనికి తోడుగా నాగబాబు లాంటి వాళ్ల మద్దతు తమకు లభించిందని అన్నారు. అంతేతప్ప, కేవలం నాగబాబు తమకు మద్దతు ఇవ్వడం వల్లే తమ ప్యానెల్ కు ఓట్లు వేశారనడం కరెక్టు కాదని, ఇదంతా సామాజిక మాధ్యమాల సృష్టేనని అన్నారు.

MAA
jeevitha Rajasheker
artist
nagababu
  • Loading...

More Telugu News