Jagan: అందని బెయిల్ ఆర్డర్.. నేడు విడుదల కానున్న జగన్‌పై దాడికేసు నిందితుడు

  • గురువారమే బెయిలు మంజూరు చేసిన కోర్టు
  • శుక్రవారం సాయంత్రం వరకు అందని బెయిల్ ఆర్డర్
  • ఈ ఏడాది జనవరి నుంచి రాజమండ్రి జైలులో శ్రీనివాస్

విశాఖపట్టణం విమానాశ్రయంలో వైసీపీ అధినేత వైస్ జగన్‌పై కోడి కత్తితో దాడి చేసిన జనుపల్లి శ్రీనివాస్ నేడు జైలు నుంచి విడుదలయ్యే అవకాశం ఉంది. రాజమండ్రి సెంట్రల్ జైలులో విచారణ ఖైదీగా ఉంటున్న శ్రీనివాస్‌ అనారోగ్యంతో బాధపడుతున్నాడని, అతడికి బెయిలు ఇవ్వాలంటూ ఆయన తరపు న్యాయవాది ఎన్ఐఏ కోర్టులో పిటిషన్ వేశారు. స్పందించిన కోర్టు కొంత పూచీకత్తుతో గురువారం బెయిలు మంజూరు చేసింది.

కోర్టు బెయిలు మంజూరు చేసినా అందుకు సంబంధించిన ఆర్డర్ శుక్రవారం సాయంత్రం వరకు జైలు అధికారులకు అందలేదు. దీంతో అతడు నేడు (శనివారం) విడుదలయ్యే అవకాశం ఉంది. జగన్‌పై దాడి కేసులో నిందితుడిగా ఉన్న శ్రీనివాసరావు ఈ ఏడాది జనవరి 18 నుంచి రాజమండ్రి కేంద్ర కారాగారంలో విచారణ ఖైదీగా ఉంటున్నాడు.

Jagan
kodi kathi
Srinivasa rao
bail
Rajahmundry
  • Loading...

More Telugu News