Telugudesam: అనంతపురం జిల్లాలో టీడీపీ, వైసీపీ కార్యకర్తల ఘర్షణ!

  • కనగానపల్లె మండలంలో ఇరు వర్గాల ఘర్షణ
  • పరస్పరం రాళ్లు రువ్వుకున్న ఇరు వర్గాలు
  • నలుగురు టీడీపీ కార్యకర్తలకు గాయాలు

అనంతపురం జిల్లాలో టీడీపీ, వైసీపీల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. కనగానపల్లె మండలంలోని భానుకోటలో టీడీపీ, వైసీపీ శ్రేణుల మధ్య ఘర్షణ తెలెత్తింది. ఇరు వర్గాలు పరస్పరం రాళ్లు రువ్వుకున్నాయి. ఈ దాడిలో నలుగురు టీడీపీ కార్యకర్తలకు గాయాలయ్యాయి. ఈ ఘటనలో టీడీపీ సానుభూతిపరుడి వాహనాలు కూడా ధ్వంసమయ్యాయి. ఓ ట్రాక్టర్, జేసీబీని వైసీపీ కార్యకర్తలు ధ్వంసం చేసినట్టు టీడీపీ కార్యకర్తలు ఆరోపిస్తున్నారు. టీడీపీ, వైసీపీ శ్రేణుల మధ్య ఘర్షణకు గల కారణాలు తెలియాల్సి ఉంది.

ఇదిలా ఉండగా, కర్నూలులో పోలీసులు తనిఖీలు నిర్వహించారు. మూడు తుపాకులు, కొన్ని తూటాలు స్వాధీనం చేసుకున్నారు. జోహరపురంలోని గుడి సమీపంలో ఓ రివాల్వర్, మొఘల్ పుర వీధిలోని ఓ పాడుబడ్డ ఇంట్లో ఓ తపంచాను స్వాధీనం చేసుకున్నారు.

Telugudesam
Yuvraj Singh
Anantapur District
kanaganapally
  • Loading...

More Telugu News