vizag: విశాఖ ఎయిర్ పోర్ట్ లో మరోసారి 'కత్తి' కలకలం!

  • ఎయిర్ పోర్టు వద్ద కత్తితో ఉన్న వ్యక్తి
  • పరవాడకు చెందిన లోవరాజుగా గుర్తింపు
  • అతనికి మతిస్థిమితం లేదని చెప్పిన పోలీసులు

విశాఖపట్టణం ఎయిర్ పోర్టులో ‘కత్తి’ కలకలం రేపింది. ఓ వ్యక్తి కత్తితో ఎయిర్ పోర్టులోకి వెళ్లేందుకు యత్నించాడు. పార్కింగ్ ఇన్ గేట్ వరకూ వెళ్లాడు. వెంటనే అప్రమత్తమైన సీఆర్పీఎఫ్ సిబ్బంది అతన్ని అదుపులోకి తీసుకుని ఎయిర్ పోర్టు పోలీసులకు అప్పగించింది. కత్తితో ఎయిర్ పోర్టుకు వచ్చిన వ్యక్తి పరవాడకు చెందిన లోవరాజుగా పోలీసులు గుర్తించారు. లోవరాజుకు మతి స్థిమితం లేదని, కొన్నేళ్లుగా చికిత్స పొందుతున్నట్టు సమాచారం. అతని బ్యాగ్ ను పోలీసులు తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఎయిర్ పోర్టు సీఐ శ్రీనివాసరావు మాట్లాడుతూ, 2007 నుంచి ప్రభుత్వాసుపత్రిలో లోవరాజు చికిత్స పొందుతున్నారని, ఇందుకు సంబంధించిన పుస్తకం, మందులు ఆయన బ్యాగ్ లో ఉన్నాయని అన్నారు.  ఇప్పటికీ మతిస్థిమితం లేదని, పొంతన లేకుండా ఆయన మాట్లాడుతున్నాడని చెప్పారు.  

vizag
airport
paravada
lovaraju
  • Loading...

More Telugu News