BSE: ఎన్డీయే ప్రభంజనంతో పరవళ్లు తొక్కిన స్టాక్ మార్కెట్

  • సూచీల పురోగమనం
  • సెన్సెక్స్ 623 పాయింట్ల మేర అప్
  • లాభాల్లో ఐసీఐసీఐ, ఎయిర్ టెల్ షేర్లు

సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీయే కూటమికి తిరుగులేని ఆధిక్యం లభించిన నేపథ్యంలో స్టాక్ మార్కెట్ దూకుడు ప్రదర్శించింది. దాదాపు అన్ని సూచీలు సానుకూల ఫలితాలు చూపించాయి. సెన్సెక్స్ 623 పాయింట్ల వృద్ధితో 39,434 పాయింట్ల వద్ద స్థిరపడగా, నిఫ్టీ 187 పాయింట్ల పెరుగుదలతో 11,844 వద్ద క్లోజయింది. 1823 కంపెనీల షేర్లు ముందంజ వేయగా, 676 సంస్థల షేర్లు పతనం అయ్యాయి. మరో 150 కంపెనీల షేర్ల క్రయవిక్రయాల్లో ఎలాంటి మార్పులేదు. ఐసీఐసీఐ బ్యాంక్, జీ ఎంటర్టయిన్ మెంట్, వేదాంత, టాటా స్టీల్, భారతీ ఎయిర్ టెల్ షేర్లు నిఫ్టీలో భారీ లాభాలు పొందగా, టెక్ మహీంద్రా, ఎన్టీపీసీ, ఓఎన్జీసీ, టీసీఎస్, హెచ్ సీఎల్ టెక్ తదితర షేర్లు నష్టాలు చవిచూశాయి.

  • Loading...

More Telugu News