Telangana: టీఆర్ఎస్ ను మెజార్టీ స్థానాల్లో గెలిపించిన ప్రజలకు ధన్యవాదాలు: కేటీఆర్

  • 16 ఎంపీ స్థానాల కోసం కష్టపడ్డాం
  • టీఆర్ఎస్ ను 9 స్థానాలల్లో గెలిపించారు
  • అంతిమంగా ప్రజా తీర్పే శిరోధార్యం

తెలంగాణలో మెజార్టీ లోక్ సభ స్థానాలను టీఆర్ఎస్ కు అందించిన ప్రజలకు ధన్యవాదాలు తెలియజేస్తున్నట్టు ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. తెలంగాణ భవన్ లో ఈరోజు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, కేంద్రంలో తమకు కావాల్సిన హక్కులు సాధించుకోవాల్సిన బాధ్యతను ప్రజలు తమకు అప్పగించారని అన్నారు. మెరుగైన ఫలితాలు రావాలని ఆశించామని, 16 స్థానాల కోసం కష్టపడ్డామని, లక్షలాది మంది టీఆర్ఎస్ కార్యకర్తలు మండుటెండల్లో కష్టపడ్డారని అన్నారు. అంతిమంగా ప్రజా తీర్పే శిరోధార్యమని. తమ పార్టీని 9 స్థానాల్లో గెలిపించారని, మిత్ర పక్షమైన ఎంఐఎం ఒక్క స్థానంలో గెలిచిందని చెప్పారు.

Telangana
cm
kcr
KTR
TRS working president
  • Loading...

More Telugu News