Telugudesam: చంద్రగిరిలో వైసీపీ అభ్యర్థి చెవిరెడ్డి విజయం

  • చంద్రగిరిని ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న టీడీపీ
  • పులివర్తి నాని ఓటమి
  • టీడీపీ వర్గాల్లో నిరాశ  

ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ చంద్రగిరి నియోజకవర్గాన్ని ఎంతో ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నా అక్కడ నిరాశ తప్పలేదు. చంద్రగిరి నుంచి వైసీపీ అభ్యర్థి చెవిరెడ్డి భాస్కరరెడ్డి విజయం సాధించారు. టీడీపీ అభ్యర్థి పులివర్తి నాని ఓటమిపాలయ్యారు. ఏప్రిల్ 11న జరిగిన పోలింగ్ లో అక్రమాలు జరిగాయంటూ చెవిరెడ్డి చేసిన ఫిర్యాదు మేరకు ఈసీ ఐదు పోలింగ్ కేంద్రాల్లో రీపోలింగ్ కు ఆదేశించింది. ఆపై టీడీపీ నాయకుల ఫిర్యాదుతో మరో రెండు స్థానాల్లో కూడా రీపోలింగ్ జరపాలని నిర్ణయించింది. ఈ నేపథ్యంలో, మే 19న తీవ్ర ఉద్రిక్తతల నడుమ చంద్రగిరి నియోజకవర్గంలో ఏడు పోలింగ్ కేంద్రాల్లో రీపోలింగ్ జరిగింది. ఫలితాల కోసం అందరూ ఆసక్తిగా ఎదురుచూడగా, ఇవాళ మధ్యాహ్నానికి చెవిరెడ్డి గెలుపుపై స్పష్టత వచ్చింది.

  • Loading...

More Telugu News