Telugudesam: వరుసగా నాలుగోసారి ఓటమిపాలైన సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి

  • టీడీపీకి మరో చేదు ఫలితం
  • కాకాణి గోవర్థన్ రెడ్డి చేతిలో సోమిరెడ్డి పరాజయం
  • నెల్లూరు జిల్లాలో టీడీపీకి ఎదురుగాలి

నెల్లూరు జిల్లాలో టీడీపీ కనీసం ఒక్క సీటు కూడా గెలిచే పరిస్థితి కనిపించడం లేదు. తెలుగుదేశం పార్టీ అభ్యర్థులందరూ ఓట్ల లెక్కింపులో బాగా వెనుకబడి ఉండగా, తాజాగా ఏపీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఓటమిపాలయ్యారు. సర్వేపల్లి నియోజకవర్గం నుంచి పోటీచేసిన సోమిరెడ్డి వైసీపీ అభ్యర్థి కాకాణి గోవర్థన్ రెడ్డి చేతిలో ఓడిపోయారు. కాగా, సోమిరెడ్డికి ప్రత్యక్ష ఎన్నికల్లో ఇది వరుసగా నాలుగో పరాజయం కావడం గమనార్హం.

  • Loading...

More Telugu News