heritage: ఏపీలో ఎన్నికల ఫలితాల ప్రభావం...హెరిటేజ్‌ షేర్లపై అమ్మకాల ఒత్తిడి

  • చంద్రబాబు కుటుంబానికి చెందిన సంస్థ ఇది
  • పార్టీ వెనుకంజలో ఉండడంతో ప్రభావం
  • ఒకేసారి రూ.64 తగ్గిన ధర...ఆ తర్వాత కాస్త కోలుకుంది

సార్వత్రిక ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్‌లో అధికార తెలుగుదేశం పార్టీ వెనుకబడడంతో ఆ ప్రభావం హెరిటేజ్‌ షేర్లపై పడింది. ముఖ్యమంత్రి కుటుంబ సభ్యులకు చెందిన సంస్థ కావడంతో ఉదయం ఫలితాల ట్రెండ్‌ మొదలు కాగానే షేర్‌ ధర పతనం కావడం ప్రారంభమైంది. ఇన్వెస్టర్ల నుంచి ఒక దశలో అమ్మకాలకు తీవ్రస్థాయిలో ఒత్తిడి పెరగడంతో రూ.475 ఉన్న ధర ఒకేసారి రూ.411కు పడిపోయింది. ఆ తర్వాత మళ్లీ కొంచెం కోలుకుని ప్రస్తుతం రూ.453 వద్ద ట్రేడవుతోంది. ఎన్నికల ఫలితాల ప్రభావం ఈ కౌంటర్‌పై బాగా కనిపిస్తోందని ఇన్వెస్టర్‌లు చెబుతున్నారు.

heritage
Chandrababu
AP results
price downwards
  • Loading...

More Telugu News