man booker prize: ‘మ్యాన్ బుకర్ ప్రైజ్’ అందుకున్న ఒమన్ రచయిత్రి జోఖా అల్హార్తి
- ఇంత వరకూ ఏ అరబిక్ రచయితకు దక్కని పురస్కారం
- ‘సెలెస్టియల్ బాడీస్’ నవలా రచయిత్రి జోఖా
- ఆ నవలను ఆంగ్లంలోకి అనువదించిన మేరిలిన్ బూత్
అంతర్జాతీయ ప్రతిష్టాత్మక ‘మ్యాన్ బుకర్ ప్రైజ్’ను ఒమన్ రచయిత్రి జోఖా అల్హార్తి అందుకున్నారు. ఆమె రచించిన ‘సెలెస్టియల్ బాడీస్’ నవలకు ఈ పురస్కారం దక్కింది. ఈ నవలను రచయిత్రి మేరిలిన్ బూత్ ఆంగ్లంలోకి అనువదించారు. ఆంగ్లంలోకి అనువదించిన ఉత్తమ నవల కింద ‘సెలెస్టియల్ బాడీస్’కు ఈ పురస్కారం దక్కింది. ఈ ఇద్దరు రచయిత్రులకు మ్యాన్ బుకర్ ప్రైజ్ కింద 63,000 అమెరికన్ డాలర్లను నిర్వాహకులు అందజేశారు.
ఇంత వరకూ ఏ అరబిక్ రచయితకు దక్కని అత్యున్నత పురస్కారం దక్కించుకున్న జోఖా అల్హార్తి వయసు నలభై ఏళ్లు. ఈ పురస్కారం అందుకున్న అనంతరం మీడియాతో ఆమె మాట్లాడుతూ, అరబిక్ సంస్కృతిని తెలిపే ఓ ద్వారం తెరచుకుందని, చాలా థ్రిల్ గా ఉందని అన్నారు. కాగా, రచయిత్రి జోఖా అల్హార్తి గురించి చెప్పాలంటే.. ఇప్పటి వరకూ ఆమె అరబిక్ భాషలో మూడు నవలలు రాశారు. పిల్లల కోసం ఆమె పుస్తకాలు రాస్తుంటారు.