Ravi Prakash: టీవీ9 మాజీ సీఈవో రవిప్రకాశ్‌ ముందస్తు బెయిల్ పిటిషన్ మరోసారి తిరస్కరణ!

  • ముందస్తు బెయిల్ పిటిషన్‌పై జరిగిన విచారణ
  • ఆయనపై అక్రమ కేసులు బనాయించారని వాదన 
  • విచారణకు హాజరు కావట్లేదన్న ప్రభుత్వ న్యాయవాది

టీవీ9 మాజీ సీఈవో రవిప్రకాశ్‌కు మరోసారి కూడా హైకోర్టులో నిరాశే మిగిలింది. ఆయన హైకోర్టులో దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్‌పై నేడు విచారణ జరిగింది. రవిప్రకాశ్ తరపున వాదనలు వినిపించిన సుప్రీంకోర్టు న్యాయవాది దిల్ జిత్ సింగ్ అహ్లువాలియా, నేషనల్ లా కంపెనీ ట్రైబ్యునల్‌లో కేసు నడుస్తుండగా పోలీసులు ఆయనపై అక్రమ కేసులు బనాయించారని పేర్కొన్నారు. రవిప్రకాశ్‌పై మూడు చోట్ల వేర్వేరు కేసులు నమోదు చేశారని కోర్టుకు విన్నవించారు. రవిప్రకాశ్ పూర్తి స్థాయిలో విచారణకు సహకరిస్తారని, అయితే ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని కోరారు.

కాగా రవిప్రకాశ్‌కు విచారణకు హాజరు కావాలని 160 సీఆర్పీసీ నోటీసులు రెండు సార్లు జారీ చేసినట్టు తెలిపారు. ఆ నోటీసులకు స్పందించకపోవడంతో 41ఏ నోటీసులు ఇచ్చినట్టు పేర్కొన్నారు. పోలీసుల విచారణకు మాత్రం హాజరు కాని రవిప్రకాశ్, వాట్సాప్ కాల్స్ ద్వారా అందరికీ టచ్‌లో ఉంటున్నారని ప్రభుత్వ తరుపు న్యాయవాది కోర్టుకు తెలిపారు. ఇరు పక్షాల వాదనలు విన్న కోర్టు రవిప్రకాశ్ ముందస్తు బెయిల్‌ పిటిషన్ ను కొట్టివేసింది.  

Ravi Prakash
TV9
High Court
National Law Tribunal
Dil Jith singh
Supreme Court
  • Loading...

More Telugu News