Andhra Pradesh: చంద్రబాబుకు ఓటమి భయం పట్టుకుంది.. వైసీపీకి 130 సీట్లు గ్యారెంటీ!: కాటసాని రాంభూపాల్ రెడ్డి

  • టీడీపీని కాపాడుకోవడానికి బాబు గిమ్మిక్కులు
  • నవరత్నాలు ప్రజలను ఆకర్షించాయి
  • కర్నూలులో మీడియాతో వైసీపీ నేత

తెలుగుదేశం పార్టీని కాపాడుకోవడానికి చంద్రబాబు గిమ్మిక్కులు చేస్తున్నారని వైసీపీ పాణ్యం అభ్యర్థి కాటసాని రాంభూపాల్ రెడ్డి విమర్శించారు. ఆయనకు ఓటమి భయం పట్టుకుందని ఎద్దేవా చేశారు. అందుకే చంద్రబాబు ప్రస్తుతం ఈవీఎంలపై ఆరోపణలు చేస్తున్నారని  దుయ్యబట్టారు. కర్నూలు జిల్లాలో ఈరోజు నిర్వహించిన మీడియా సమావేశంలో రాంభూపాల్ రెడ్డి మాట్లాడారు.

వైసీపీ ప్రకటించిన నవరత్నాలు పథకాలు ప్రజలను ఆకర్షించాయని ఆయన చెప్పారు. ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ 130 స్థానాల్లో ఘనవిజయం సాధిస్తుందని జోస్యం చెప్పారు. లగడపాటి రాజగోపాల్ సర్వేను ప్రజలు నమ్మరని తేల్చిచెప్పారు. వైఎస్ జగన్ నాయకత్వంలోనే ఏపీకి న్యాయం జరుగుతుందని రాష్ట్ర ప్రజలు నమ్ముతున్నారని తెలిపారు. జగన్ సీఎం అవుతారని జాతీయ సర్వేలు కూడా స్పష్టం చేస్తున్నాయని వ్యాఖ్యానించారు.

Andhra Pradesh
Chandrababu
Telugudesam
YSRCP
katasani ram bhupal reddy
130 seats
  • Loading...

More Telugu News