vijay: విజయ్ తో జత కడుతున్నట్టుగా వస్తోన్న వార్తలపై స్పందించిన రష్మిక

  • రష్మికకి యూత్ లో మంచి క్రేజ్
  • తమిళంలో కార్తీ సరసన అవకాశం
  • విజయ్ సినిమాలో లేనన్న రష్మిక

తెలుగులో 'ఛలో' .. 'గీత గోవిందం' వంటి ప్రేమకథా చిత్రాలతో రష్మిక మందన కుర్రకారు మనసులు దోచేసుకుంది. దాంతో తెలుగుతో పాటు తమిళం నుంచి కూడా ఈ సుందరికి వరుస అవకాశాలు వస్తున్నాయి. ఈ క్రమంలోనే ఈ చిన్నది కార్తీ సరసన నటించడానికి సిద్ధమవుతోంది. 'రెమో' ఫేమ్ బక్కియరాజ్ కన్నన్ దర్శకత్వంలో త్వరలోనే ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది. ఈ నేపథ్యంలో విజయ్ 64వ సినిమాలోను రష్మిక అవకాశాన్ని దక్కించుకుందనే టాక్ కోలీవుడ్లో వినిపిస్తోంది.

ప్రస్తుతం విజయ్ 63వ సినిమా షూటింగు జరుపుకుంటోంది. అట్లీ కుమార్ ఈ సినిమాకి దర్శకుడిగా వ్యవహరిస్తున్నాడు. విజయ్ 64వ సినిమాకి లోకేశ్ మనగరం దర్శకుడిగా వ్యవహరించనున్నాడు. ఆయనే విజయ్ కి జోడీగా రష్మికను ఎంపిక చేసుకున్నట్టుగా ప్రచారం జరుగుతోంది. ఈ విషయంపై రష్మిక స్పందిస్తూ, 'ఈ సినిమా కోసం ఇంతవరకూ నన్ను ఎవరూ సంప్రదించలేదు. ఈ ప్రచారం నిజమైతే బాగుండునని నాకూ వుంది" అంటూ చెప్పుకొచ్చింది.

  • Loading...

More Telugu News