APSRTC: ఏపీఎస్ఆర్టీసీలో మోగిన సమ్మె సైరన్... 13 నుంచి నిరవధిక సమ్మె!

  • నిర్ణయాన్ని వెల్లడించిన ఉద్యోగ సంఘాలు
  • న్యాయమైన కోరికలను తీర్చడంలో నిర్లక్ష్యం
  • తప్పనిసరి పరిస్థితుల్లోనే సమ్మె చేస్తున్నామన్న ఉద్యోగసంఘాలు

ఏపీఎస్ఆర్టీసీలో సమ్మె సైరన్ మోగింది. జూన్ 13 నుంచి తాము నిరవధిక సమ్మెకు వెళ్లనున్నట్టు ఉద్యోగ సంఘాలు కొద్దిసేపటిక్రితం ప్రకటించాయి. ఎంతోకాలంగా తమ న్యాయమైన కోరికలను తీర్చేందుకు యాజమాన్యం శ్రద్ధ చూపలేదని, ఆర్టీసీలో వేల కొద్దీ ఖాళీలను భర్తీ చేయకుండా, ఉన్నవారిపై ఒత్తిడిని పెంచుతున్నారని ఆరోపించిన ఉద్యోగ సంఘాల నేతలు, తప్పని సరి పరిస్థితుల్లోనే సమ్మెకు దిగాలని నిర్ణయించినట్టు తెలిపాయి.

 ఈ విషయంలో ప్రజలు తమ సమస్యలను అర్థం చేసుకుని సహకరించాలని ఉద్యోగ సంఘాల ప్రతినిధులు కోరారు. ఆర్టీసీ యాజమాన్యం కార్మిక వర్గాలను రెచ్చగొట్టి, చీలిక తేవడం ద్వారా సమ్మెను నిర్వీర్యం చేయాలని ప్రయత్నిస్తున్నట్టు తమకు సమాచారం ఉందని, అటువంటివి జరిగితే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని వారు హెచ్చరించారు. సమస్యల పరిష్కారం దిశగా యాజమాన్యానికి మరోమారు అవకాశం ఇవ్వాలన్న ఉద్దేశంతోనే జూన్ 13ను సమ్మె తేదీగా ప్రకటిస్తున్నామని తెలిపారు.

  • Loading...

More Telugu News