Devisri Prasad: వాడికి రెండున్నరేళ్లే.. నేను కూడా ఆశ్చర్యపోయా: దేవిశ్రీ ప్రసాద్

  • వాడికి సంగీతం ఎవరూ నేర్పించలేదు
  • తానే స్వయంగా నేర్చుకున్నాడు
  • నాన్న ఆశీర్వాదంతోనే జరిగింది

రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ తన మేనల్లుడికి సంబంధించిన వీడియోను ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. ఆ వీడియోలో దేవిశ్రీ మేనల్లుడు తానవ్ సత్య సంగీత వాయిద్యాల వంటి పరికరాలను ముందు పెట్టుకుని వాయిస్తున్నాడు. తానవ్ అలా వాయించడం చూసి తాను ఆశ్చర్యపోయాయని, తనకెవరూ సంగీతం నేర్పించలేదంటూ దేవి ట్వీట్‌లో పేర్కొన్నారు.

‘వాడికి సంగీతం ఎవరూ నేర్పించలేదు. తానే స్వయంగా నేర్చుకున్నాడు. నేను కూడా ఆశ్చర్యపోయాను. వాడికి రెండన్నరేళ్లే. నెలల బాబుగా ఉన్నప్పటి నుంచే వాడు ఇలా చేయడం మొదలు పెట్టాడు. ఇదంతా నాన్న ఆశీర్వాదాలతో జరిగింది’ అని ట్వీట్‌ చేశారు.

Devisri Prasad
Tanav Satya
Twitter
Music
Video
  • Loading...

More Telugu News