Andhra Pradesh: ఏపీలో తీవ్ర స్థాయిలో వీయనున్న వడగాల్పులు!

  • ఈ నెల 25- 29 వరకు తీవ్రస్థాయిలో వడగాల్పులు
  •  కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, కడప జిల్లాలపై ప్రభావం
  • రాష్ట్రంలో 45- 48 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయ్యే సూచన 

ఏపీలో మళ్లీ వడగాల్పులు పెరగనున్నాయి. ఈ నెల 25 నుంచి 29 వరకు తీవ్రస్థాయిలో వడగాల్పులు వీయనున్నాయి. కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, కడప జిల్లాల్లో వడగాల్పులు తీవ్రంగా ఉండనున్నట్టు ఆర్టీజీఎస్ పేర్కొంది. రాష్ట్రంలో పలు చోట్ల 45 నుంచి 48 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయ్యే సూచనలు ఉన్నట్లు తెలిపింది. మరోపక్క, ఈ నెల 23 నుంచి 27వ తేదీ వరకు రాయలసీమలో వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు తెలిపింది. అనంతపురం, చిత్తూరు జిల్లాల్లోని కొన్ని మండలాల్లో ఒక మోస్తరు వర్షాలు కురుస్తాయని ఆర్టీజీఎస్ తెలిపింది.

Andhra Pradesh
RTGS
Mercury
Krishna
guntur
  • Loading...

More Telugu News