vice president: ఒక్క రూపాయికే అంత్యక్రియల పథకంపై ఉపరాష్ట్రపతి ప్రశంసలు

  • అమలు కానున్న ‘అంతిమయాత్ర.. ఆఖరి సఫర్’ పథకం
  • ఈ పథకం వివరాలు తెలుసుకున్న ఉపరాష్ట్రపతి
  • కరీంనగర్ కార్పొరేషన్ మేయర్ కు వెంకయ్యనాయుడు అభినందనలు 

కరీంనగర్ నగరపాలక సంస్థ ప్రవేశపెట్టనున్న ‘అంతిమయాత్ర.. ఆఖరి సఫర్’ పథకంపై ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ప్రశంసలు కురిపించారు. ఈ పథకం వివరాలు తెలుసుకున్న ఆయన తన ట్విట్టర్ ఖాతా ద్వారా స్పందించారు. కులమతాలకు, ధనికపేదలకు అతీతంగా అందరికీ అందుబాటులోకి తెస్తూ ఈ పథకాన్ని రూపొందించిన కరీంనగర్ కార్పొరేషన్ మేయర్ రవీందర్ సింగ్ కు అభినందనలు తెలిపారు.

కాగా, కరీంనగర్ నగర పరిధిలో ఎవరు చనిపోయినా ఒక్క రూపాయికే వారి అంత్యక్రియలు నిర్వహిస్తామని, అందుకోసం ‘అంతిమయాత్ర.. ఆఖరి సఫర్’ పథకాన్ని ప్రవేశపెట్టనున్నట్టు కరీంనగర్ మేయర్ రవీందర్ సింగ్ నిన్న ప్రకటించారు. వచ్చే నెల 15 లోగా ఈ పథకాన్ని అమలు చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు.

vice president
Venkaiah Naidu
Karimnagar District
mayor
ravinder singh
  • Loading...

More Telugu News