Prime Minister: ప్రధాని ఎవరైనా... ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు మొదలు!

  • 23 మధ్యాహ్నానికి కొత్త ప్రభుత్వంపై అంచనా
  • 26న పీఎం ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు
  • సన్నాహాలు చేస్తున్న రాష్ట్రపతి భవన్

మరో 48 గంటల తరువాత దేశానికి కాబోయే ప్రధాని ఎవరన్న విషయం దాదాపుగా తేలిపోతుంది. ప్రస్తుతం అధికారంలో ఉన్న ఎన్డీయే మరోసారి అధికారంలోకి వస్తుందా? 2014లో అధికారానికి దూరమైన యూపీఏ తిరిగి గద్దెనెక్కుతుందా? అన్న విషయంలో సస్పెన్స్ నెలకొని ఉన్నప్పటికీ, నూతన ప్రధాని పదవీ బాధ్యతల స్వీకారం కోసం రాష్ట్రపతి భవన్ ఏర్పాట్లను ప్రారంభించింది. 23న మధ్యాహ్నానికి కొత్త ప్రభుత్వంపై ఓ అంచనా వచ్చేస్తుంది. ఇక, 26న కొత్త ప్రధాన మంత్రి ప్రమాణ స్వీకారోత్సవానికి రాష్ట్రపతి భవన్‌ అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. ఇప్పటికే సైనిక కవాతు డ్రస్ రిహార్సల్స్ జరుగగా, వేదిక, అతిథులకు ఏర్పాట్లు తదితరాలపై అధికారులు దృష్టి పెట్టారు.

Prime Minister
Rashtrapathi Bhavan
Oath
  • Loading...

More Telugu News