Nims Hospital: నిమ్స్ ఆసుపత్రి అత్యవసర విభాగం వద్ద వైద్యుల ధర్నా

  • సరైన వైద్యం అందించడం లేదంటూ దాడి
  • అత్యవసర విభాగం వద్ద హంగామా
  • ఐదుగురిని అదుపులోకి తీసుకున్న పోలీసులు

నిఖిల్ అనే వ్యక్తిని నేటి తెల్లవారు జామున పంజాగుట్టలోని నిమ్స్ ఆసుపత్రి అత్యవసర చికిత్సా విభాగంలో చేర్చారు. అయితే రోగికి సరైన వైద్యం అందించడం లేదంటూ కొందరు వ్యక్తులు వైద్యుడిపై దాడి చేశారు. అంతేకాకుండా అత్యవసర చికిత్స విభాగం వద్ద హంగామా సృష్టించారు. దీంతో దాడికి పాల్పడిన వారిపై చర్య తీసుకోవాలని డిమాండ్ చేస్తూ నిమ్స్ ఆసుపత్రి అత్యవసర విభాగం వద్ద వైద్యులు ధర్నా చేశారు.

భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలంటూ డిమాండ్ చేశారు. వైద్యుల ఫిర్యాదు మేరకు ఐదుగురిని అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారణ నిర్వహిస్తున్నారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలను హైదరాబాద్‌ పశ్చిమ మండలం డీసీపీ ఏఆర్‌ శ్రీనివాస్‌ వైద్యులను అడిగి తెలుసుకున్నారు.

Nims Hospital
Doctors
Protest
Nikhil
Punjagutta
AR Srinivas
  • Loading...

More Telugu News