sensex: మోదీ ఎఫెక్ట్.. పదేళ్ల తర్వాత భారీ లాభాల్లో దూసుకుపోయిన మార్కెట్లు

  • మోదీకే మళ్లీ పట్టం కట్టిన ఎగ్జిట్ పోల్స్
  • భారీగా పెరిగిన ఇన్వెస్టర్ల సెంటిమెంట్
  • 421 పాయింట్లు లాభపడ్డ నిఫ్టీ

ఎన్డీయేకు స్పష్టమైన మెజార్టీ రాబోతోందని, మోదీ మరోసారి ప్రధాని కాబోతున్నారంటూ ఎగ్జిట్ పోల్స్ లో వెల్లడి కావడంతో స్టాక్ మార్కెట్లు దూసుకుపోయాయి. బీజేపీ కూటమి మళ్లీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందన్న అంచనాలతో ఇన్వెస్టర్ల సెంటిమెంట్ బలపడింది. ఈ నేపథ్యంలో సెన్సెక్స్ మరోసారి 39వేల మార్కును అధిగమించింది. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 1,422 పాయింట్లు పెరిగి 39,352కు చేరుకుంది. నిఫ్టీ 421 పాయింట్లు పుంజుకుని 11,828కి ఎగబాకింది. దేశీయ మార్కెట్లు ఈ రేంజ్ లో లాభపడటం పదేళ్ల తర్వాత ఇదే తొలిసారి కావడం గమనార్హం.

బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
ఇండస్ ఇండ్ బ్యాంక్ (8.64%), స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (8.04%), టాటా మోటార్స్ (7.53%), యస్ బ్యాంక్ (6.73%), ఎల్ అండ్ టీ (6.55%).

మరోవైపు బీఎస్ఈ సెన్సెక్స్ లో కేవలం బజాజ్ ఆటో (-1.18%), ఇన్ఫోసిస్ (-0.19%) మాత్రమే నష్టాల్లో ముగిశాయి. 

  • Loading...

More Telugu News