Vijayasanthi: మోదీ ప్రభంజనం ఉన్న 2014లో కూడా ఈస్థాయిలో ఎగ్జిట్ పోల్స్ రాలేదు: విజయశాంతి

  • మోదీ హవా యూపీలోనే లేదు, దేశంలో ఎక్కడ ఉంది?
  • బీజేపీని చూసి జాలిపడడం తప్ప ఇంకేమీ చేయలేం
  • మోదీని సంతృప్తి పరచడానికే ఈ రకమైన ఎగ్జిట్ పోల్స్

సార్వత్రిక ఎన్నికల్లో అన్ని విడతల పోలింగ్ ముగియగానే జాతీయ మీడియా సంస్థలు ఎగ్జిట్ పోల్స్ తో సందడి చేయడంపై తెలంగాణ కాంగ్రెస్ నేత విజయశాంతి స్పందించారు. ఎగ్జిట్ పోల్స్ అన్నీ ఒకే తీరులో ఉన్నాయని, ప్రధాని నరేంద్ర మోదీని సంతృప్తి పరచడానికే ఈ విధమైన అంచనాలు వెలువరించినట్టు అనిపిస్తోందని వ్యాఖ్యానించారు. ఈ ఎగ్జిట్ పోల్స్ చూసి మురిసిపోతున్న బీజేపీని చూసి జాలిపడడం తప్ప ఇంకేమీ చేయలేమని అన్నారు.

2014లో మోదీ ప్రభంజనం ఉన్నప్పుడు కూడా ఈ స్థాయిలో ఎగ్జిట్ పోల్స్ రాలేదని, అలాంటిది ఇప్పుడాయనపై ఎంతో వ్యతిరేకత ఉందని, అయినాగానీ ఎగ్జిట్ పోల్స్ అన్నీ బీజేపీకి పూర్తి అనుకూలంగా ఉండడం ఆశ్చర్యం కలిగిస్తోందని అన్నారు. మోదీ హవా నిజమే అయితే ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న యూపీలో ఎందుకు బీజేపీ వెనుకబడిందని ప్రశ్నించారు. యూపీలోనే ఆయన ప్రజాదరణ పొందలేకపోతే దేశవ్యాప్తంగా ఆయనకు అనుకూల ఓటింగ్ ఎలా జరిగినట్టు? అని నిలదీశారు.

Vijayasanthi
BJP
Congress
Narendra Modi
  • Loading...

More Telugu News