exit polls: ఎగ్జిట్ పోల్స్ అన్నీ అబద్ధాలే: పళనిస్వామి

  • స్టాలిన్ కు పట్టం కట్టిన ఎగ్జిట్ పోల్స్
  • ఎగ్జిట్ పోల్స్ చెప్పేవన్నీ నిజాలు కాదన్న పళనిస్వామి
  • 39 సీట్లను గెలుచుకుంటామంటూ ధీమా

తమిళనాట స్టాలిన్ నేతృత్వంలోని డీఎంకే స్వీప్ చేయబోతోందని ఎగ్జిట్ పోల్స్ లో వెల్లడైన సంగతి తెలిసిందే. తమిళనాడులో మొత్తం 39 పార్లమెంటు స్థానాలు ఉండగా... భారీ ఎత్తున నగదు పట్టుబడటంతో... వేలూరు నియోజకర్గంలో పోలింగ్ ను ఈసీ ఆపేసింది. మిగిలిన 38 సీట్లలో డీఎంకేకు 27 నుంచి 34 సీట్లు వస్తాయని వివిధ ఎగ్జిట్ పోల్స్ వెల్లడించాయి. అన్నాడీఎంకే-బీజేపీ కూటమికి 11 వరకు వచ్చే అవకాశం ఉందని అంచనా వేశాయి.

ఈ నేపథ్యంలో తమిళనాడు ముఖ్యమంత్రి పళనిస్వామి స్పందించారు. ఎగ్జిట్ పోల్స్ అన్నీ అబద్ధాలే అని ఆయన అన్నారు. తమిళనాడు, పుదుచ్చేరిలలో అన్నాడీఎంకే కూటమి మొత్తం 39 సీట్లను గెలుచుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు.

2014 సార్వత్రిక ఎన్నికల్లో జయలలిత నేతృత్వంలోని అన్నాడీఎంకేకు భంగపాటు తప్పదని ఎగ్జిట్ పోల్స్ వెల్లడించాయి. అయితే, వాటి అంచనాలను తలకిందులు చేస్తూ అన్నాడీఎంకే ఏకంగా 37 సీట్లను కైవసం చేసుకుని... అందరికీ షాక్ ఇచ్చింది.

exit polls
palaniswamy
dmk
aiadmk
  • Loading...

More Telugu News