prabhas: రేపు సర్ ప్రైజ్ చేస్తానంటోన్న ప్రభాస్

  • షూటింగు దశలో 'సాహో'
  • రేపు పోస్టర్ రిలీజ్ చేసే ఛాన్స్ 
  • ఆగస్టు 15వ తేదీన భారీ రిలీజ్

ప్రభాస్ తాజా చిత్రంగా 'సాహో' రూపొందుతోంది. సుజిత్ దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమాలో, ప్రభాస్ జోడీగా శ్రద్ధాకపూర్ కనిపించనుంది. ఈ సినిమా నుంచి ఈ మధ్య ఎలాంటి అప్ డేట్స్ లేకపోవడంతో, ప్రభాస్ అభిమానులు చాలా అసంతృప్తితో వున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా ప్రభాస్ ఒక వీడియో బైట్ ను రిలీజ్ చేశాడు. రేపు ఒక సర్ ప్రైజింగ్ న్యూస్ ఉంటుందని చెప్పాడు.

'సాహో' నుంచి ఒక పోస్టర్ ను రిలీజ్ చేసే అవకాశం ఉందనే టాక్ ఫిల్మ్ నగర్లో వినిపిస్తోంది. ఇటీవల హైదరాబాద్ - పార్క్ హయత్ హోటల్లో ప్రభాస్ పై ప్రత్యేకంగా ఫొటో షూట్ ను నిర్వహించారు. ఆ ఫొటోలను ప్రచారానికి ఉపయోగించనున్నట్టు తెలుస్తోంది. 250 కోట్లకి పైగా బడ్జెట్ తో రూపొందుతోన్న ఈ సినిమాను, ఆగస్టు 15వ తేదీన విడుదల చేయాలనే ఆలోచనలో వున్నారు. 'బాహుబలి 2' తరువాత చాలా గ్యాప్ తో ఈ సినిమా రానుండటం వలన, అభిమానుల్లో ఆసక్తి పెరుగుతోంది.

prabhas
shraddha kapoor
  • Error fetching data: Network response was not ok

More Telugu News