Exit polls: బీజేపీ గెలుస్తుందన్న ఎగ్జిట్ పోల్స్.. మోదీకి కంగ్రాట్స్ చెప్పిన మాల్దీవుల అధ్యక్షుడు

  • ఎగ్జిట్ పోల్స్‌లో బీజేపీ హవా
  • ట్వీట్ చేసి మోదీని అభినందించిన నషీద్
  • భారత్‌తో తమ సంబంధాలు మరింత సన్నిహితం అవుతాయన్న అధ్యక్షుడు

ఈ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధిస్తుందని, మోదీ మరోమారు ప్రధాని పీఠాన్ని అధిష్ఠిస్తారని ఎగ్జిట్ పోల్స్ అన్నీ ముక్తకంఠంతో చెప్పాయి. ఈ నేపథ్యంలో భారత ప్రధాని నరేంద్రమోదీకి, బీజేపీకి మాల్దీవుల అధ్యక్షుడు మహ్మద్ నషీద్ అభినందనలు తెలిపారు. త్వరలో ఏర్పడబోయే బీజేపీ సారథ్యంలోని కొత్త ప్రభుత్వంతో తమ సంబంధాలు మరింత సన్నిహితంగా కొనసాగుతాయని పేర్కొన్నారు. ఎగ్జిట్ పోల్స్ అన్నీ బీజేపీకే అనుకూలమని తేల్చాయని, భారత్‌తో కొనసాగుతున్న తమ సంబంధాలు మరింత సన్నిహితం అవుతాయని నషీద్ ట్వీట్ చేశారు.

గతేడాది నవంబరులో ప్రధాని మోదీ మాల్దీవులను సందర్శించారు. అధ్యక్షుడు ఇబ్రహీం మహ్మద్ సోలీ ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరయ్యారు. అదే ఏడాది డిసెంబరులో ఏడాది సోలీ భారత్‌ను సందర్శించారు. ఈ సందర్భంగా ఆ దేశానికి భారత్ 1.4 బిలియన్ డాలర్ల ఆర్థిక సాయం ప్రకటించింది.

Exit polls
Maldives
President
Nasheed
Narendra Modi
BJP
  • Loading...

More Telugu News