Kamal Haasan: విలన్‌ను హీరో అంటే నేనెలా అంగీకరిస్తా?: కమలహాసన్

  • నా హీరో మహాత్మాగాంధీనే
  • గాంధీ హత్య తర్వాత ఆయన కళ్లజోడు, చెప్పులు పోయాయి
  • నాపై చెప్పు విసిరిన వ్యక్తికే అది అవమానం

జాతిపిత మహాత్మా గాంధీని చంపిన గాడ్సే ఎప్పటికీ విలనేనని, ఆయనను హీరోగా ఎప్పటికీ అంగీకరించబోనని తమిళ సూపర్ స్టార్, ఎంఎన్ఎం పార్టీ చీఫ్ కమల హాసన్ స్పష్ట చేశారు. గాంధీ ఎప్పటికీ సూపర్ స్టారేనని కొనియాడారు. ఓసారి గాంధీ రైలులో ప్రయాణం చేస్తున్న సమయంలో ఆయన పాదరక్ష ఒకటి కిందపడిపోయిందని, దీంతో ఆయన రెండో దానిని కూడా కిందపడేశారని కమల్ అన్నారు. ఆ రెండూ వేరొకరికి పనికొస్తాయన్నది గాంధీ ఉద్దేశమని పేర్కొన్నారు.

గాంధీ హత్యకు గురైన రోజున ఆయన కళ్లజోడు, చెప్పులు పోయాయని, ఇటీవలే ఈ విషయం తనకు తెలిసిందన్నారు. స్వతంత్ర భారతదేశంలో తొలి ఉగ్రవాది హిందువేనంటూ ఇటీవల తాను చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై కమల్ మాట్లాడుతూ.. ఓ విలన్‌ను తాను హీరోగా ఎప్పటికీ అంగీకరించబోనన్నారు. గాంధీనే తన హీరో అని పునరుద్ఘాటించారు. ఇటీవల ఓ వ్యక్తి తనపై చెప్పు విసిరిన విషయం గురించి మాట్లాడుతూ, అది అతడికే అవమానమని కమల్ పేర్కొన్నారు.

Kamal Haasan
mahatma Gandhi
MNM
nathuram godse
  • Loading...

More Telugu News