CEC: 2014తో పోలిస్తే ఈసారి ఓటింగ్ శాతం పెరిగింది: సీఈసీ

  • ఎండవేడిమి కూడా ఓటర్లు లెక్కచేయలేదు
  •  ఆరు విడతల్లో 67.37 శాతం పోలింగ్ నమోదైంది
  • ఏడో విడత పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది

2014తో పోలిస్తే ఈసారి ఓటింగ్ శాతం పెరిగిందని కేంద్ర ఎన్నికల కమిషనర్ (సీఈసీ) సునీల్ అరోరా పేర్కొన్నారు. ఢిల్లీలో ఈరోజు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఎండవేడిమి కూడా లెక్క చేయకుండా ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారని అన్నారు. ఆరు విడతల్లో 67.37 శాతం పోలింగ్ నమోదైందని, కోటి ఎనభై లక్షల మంది యువత ఓటు వేశారని చెప్పారు. కాసేపట్లో ముగియనున్న ఏడో విడత పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోందని అన్నారు.

CEC
sunil arora
Elections
Delhi
  • Loading...

More Telugu News