UK: డాక్టర్ ముందు బురఖా తొలగించిన మహిళ... భర్త వచ్చేసరికి మాట మార్చిన వైనం!

  • ఇంగ్లాండ్ లో ఘటన
  • భర్త కోపం చూసి డాక్టర్ పై ఫిర్యాదు చేసిన భార్య
  • డాక్టర్ ను చీవాట్లు పెట్టిన అధికారులు

ఇంగ్లాండ్ లో జరిగిన ఈ సంఘటన కొన్ని సున్నితమైన అంశాల్లో ఎలా వ్యవహరించాలన్న దానికి నిదర్శనంగా నిలుస్తుంది. ఇంగ్లాండ్ లోని రాయల్ స్ట్రోక్ యూనివర్శిటీ ఆసుపత్రికి ఓ రోజు బురఖా ధరించిన యువతి వచ్చింది. ఆ సమయంలో డాక్టర్ కీత్ వోల్వర్ సన్ విధుల్లో ఉన్నాడు. ఆ వైద్యుడికి 23 ఏళ్ల అనుభవం ఉంది. అయితే, బురఖాలోంచి ఆమె మాట్లాడుతున్న మాటలు స్పష్టంగా వినిపిస్తుండకపోవడంతో ఆమెను బురఖా తొలగించి మాట్లాడాలని కోరాడు. దాంతో ఆ మహిళ అలాగే చేసింది.

ఇంతలో ఆమె భర్త ఆ క్లినిక్ లో అడుగుపెట్టి భార్య ముఖంపై బురఖా లేకపోవడం చూసి ఆగ్రహం వ్యక్తం చేశాడు. భర్త కోపాన్ని చూసి ఆ యువతి వెంటనే మాట మార్చేసింది. తన అనుమతి లేకుండా ఆ డాక్టరే బురఖా తొలగించాడని, తనతో అదో రకంగా ప్రవర్తించాడంటూ చెప్పింది. ఇది విన్న డాక్టర్ కు మతిపోయినంత పనైంది. ఈ వ్యవహారంపై ఆ మహిళ భర్త యూనివర్శిటీ అధికారులకు ఫిర్యాదు చేయగా, వాళ్లు డాక్టర్ నే తప్పుబట్టారు. ఆమె మాటలు అర్థంకాకపోతే, ఆమెను లేడీ డాక్టర్ వద్దకు పంపించాల్సింది పోయి మీరెందుకు బురఖా తీయమన్నారంటూ చీవాట్లు పెట్టారట!

UK
  • Loading...

More Telugu News