Jayashankar Bhupalpally District: కాళేశ్వరం ముక్తీశ్వరస్వామికి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రత్యేక పూజలు

  • ఈరోజు ఉదయం స్వామిని దర్శించుకున్న సీఎం
  • పూర్ణకుంభంతో స్వాగతం పలికిన అర్చకులు
  • వేదాశీర్వచనం అనంతరం ప్రసాదం అందజేత

జయశంకర్‌ భూపాలపల్లి జిల్లాలోని ప్రసిద్ధ కాళేశ్వరం ముక్తీశ్వరస్వామిని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ దంపతులు ఈరోజు ఉదయం దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. నిన్న సాయంత్రం రామగుండం ఎన్టీపీసీని సందర్శించిన సీఎం కేసీఆర్‌ రాత్రి అక్కడి అతిథి గృహంలోనే బస చేశారు. అక్కడి నుంచి ఉదయం హెలికాప్టర్‌లో కాళేశ్వరం చేరుకుని స్వామి దర్శనం చేసుకున్నారు. ఆలయానికి చేరుకున్న కేసీఆర్‌కు అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ప్రత్యేక పూజల అనంతరం వేదాశీర్వచనం పలికి స్వామి వారి ప్రసాదాన్ని అందజేశారు.

Jayashankar Bhupalpally District
kaleswaram
cm kcr
  • Loading...

More Telugu News