Southwest Monsoon: రెండు రోజుల ముందుగానే అండమాన్‌ను తాకిన నైరుతి రుతుపవనాలు

  • శనివారం దక్షిణ అండమాన్ సముద్రంలోకి ప్రవేశం
  • మూడు నాలుగు రోజుల్లో దక్షిణ బంగాళాఖాతంలోకి
  • వెల్లడించిన వాతావరణ శాఖ

నైరుతి రుతుపవనాలు రెండు రోజుల ముందుగానే అండమాన్‌ను తాకాయి. దక్షిణ అండమాన్ సముద్రం, దక్షిణ బంగాళాఖాతం, నికోబార్ దీవుల్లోని కొన్ని ప్రాంతాలను శనివారం ఇవి పలకరించాయి. నిజానికి ప్రతి ఏడాది మే 20న నైరుతి రుతుపవనాలు అండమాన్‌ను తాకుతుంటాయి. అయితే, ఈసారి మాత్రం రెండు రోజుల ముందుగానే అండమాన్ సముద్రంలోకి ప్రవేశించాయి. మరో మూడునాలుగు రోజుల్లో ఇవి  దక్షిణ బంగాళాఖాతం, ఉత్తర అండమాన్‌ సముద్రం, అండమాన్‌ దీవుల్లోకి ప్రవేశిస్తాయని భారత వాతావరణ శాఖ తెలిపింది.

  • Loading...

More Telugu News