Andhra Pradesh: తెలుగు సినీ పరిశ్రమ ఓ మంచి నటుడిని కోల్పోయింది!: నారా లోకేశ్

  • నిన్న తుదిశ్వాస విడిచిన రాళ్లపల్లి నర్సింహారావు
  • సంతాపం తెలిపిన పలువురు సినీ,రాజకీయ ప్రముఖులు
  • రాళ్లపల్లి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపిన లోకేశ్

ప్రముఖ నటుడు రాళ్లపల్లి నర్సింహారావు మరణంపై ఏపీ ఐటీ మంత్రి నారా లోకేశ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. రాళ్లపల్లి మృతితో తెలుగు సినీపరిశ్రమ ఓ మంచి నటుడిని కోల్పోయిందని వ్యాఖ్యానించారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నట్లు చెప్పారు. ఈ సందర్భంగా రాళ్లపల్లి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.

ఈరోజు ట్విట్టర్ లో లోకేశ్ స్పందిస్తూ..‘ప్రముఖ సీనియర్ నటులు రాళ్ళపల్లిగారి మరణం చాలా విచారకరం. సినీ పరిశ్రమ ఒక మంచి నటుణ్ని కోల్పోయింది. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ.. వారి కుటుంబ సభ్యులకు, అభిమానులకు నా ప్రగాఢ సానుభూతి తెలియచేస్తున్నాను’ అని ట్వీట్ చేశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న రాళ్లపల్లి నిన్న హైదరాబాద్ లోని మ్యాక్స్ క్యూర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు.

Andhra Pradesh
Nara Lokesh
Twitter
rallapalli
death
  • Loading...

More Telugu News