Tollywood: నాటక, చలనచిత్ర రంగాల్లో రాళ్లపల్లిది ప్రత్యేక స్థానం: సీఎం చంద్రబాబు సంతాపం

  • సినీ నటుడు రాళ్లపల్లి మృతిపై సంతాపం
  • సునిశిత హాస్యంతో గుర్తింపు తెచ్చుకున్నారు
  • తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో రాళ్లపల్లిది చెరగని ముద్ర

సినీ నటుడు రాళ్లపల్లి మృతిపై ఏపీ సీఎం చంద్రబాబు సంతాపం వ్యక్తం చేశారు. నాటక, చలనచిత్ర రంగాల్లో రాళ్లపల్లిది ప్రత్యేక స్థానమని, తనదైన శైలిలో సునిశిత హాస్యంతో గుర్తింపు తెచ్చుకున్నారని కొనియాడారు. తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో రాళ్లపల్లి చెరగని ముద్ర వేశారని చంద్రబాబు అన్నారు.  

కాగా, రాళ్లపల్లికి గుర్తింపు తీసుకొచ్చిన వాటిలో చిల్లరదేవుళ్లు, చలిచీమలు, తూర్పు వెళ్లే రైలు వంటి పలు చిత్రాలు ఉన్నాయి. జంధ్యాల, వంశీ చిత్రాల్లో ఆయన కీలకపాత్రల్లో నటించారు. మణిరత్నం ’బొంబాయి’ సినిమాలో ‘హిజ్రా’ పాత్రలో రాళ్లపల్లి నటించి మెప్పించారు.

Tollywood
Rallapalli
cm
Chandrababu
AP
  • Loading...

More Telugu News