srinagar: ఎయిర్ బేస్ లపై దాడికి స్కెచ్.. ఉగ్రవాది నుంచి మ్యాప్ స్వాధీనం

  • నిన్న ఎన్ కౌంటర్ కు గురైన టెర్రరిస్టులు
  • ఓ ముష్కరుడి నుంచి దాడికి సంబంధించిన స్కెచ్ స్వాధీనం
  • శ్రీనగర్, అవంతిపురా ఎయిర్ బేస్ లపై దాడికి ప్లాన్

జమ్ముకశ్మీర్ లో మరిన్ని భీకర దాడులకు పాకిస్థాన్ ఉగ్రవాదులు స్కెచ్ వేశారు. మే 23న శ్రీనగర్, అవంతిపురా ఎయిర్ బేస్ లపై ఉగ్రవాదులు దాడి చేయబోతున్నారంటూ ఇంటెలిజెన్స్ విభాగం హెచ్చరించింది. ఎన్నికల ఫలితాలు వెలువడే రోజున వీరు దాడి చేసేందుకు కుట్ర పన్నారని తెలిపింది. సోఫియాన్ లో నిన్న ఎన్ కౌంటర్ కు గురైన టెర్రరిస్టుల్లోని ఒక వ్యక్తి నుంచి భద్రతాదళాలు ఒక స్కెచ్ ను స్వాధీనం చేసుకున్నాయి. ఈ స్కెచ్ ద్వారా శ్రీనగర్, అవంతిపురా ఎయిర్ బేస్ లపై ఫిదాయీన్ తరహా దాడులకు ముష్కరులు పాల్పడబోతున్నారనే విషయం స్పష్టమైంది.

srinagar
awantipora
air base
terrorist
sketch
  • Loading...

More Telugu News