sensex: ఎగ్జిట్ పోల్స్ నేపథ్యంలో దూసుకుపోయిన మార్కెట్లు

  • 537 పాయింట్లు లాభపడ్డ సెన్సెక్స్
  • 150 పాయింట్లు పెరిగిన నిఫ్టీ
  • 6 శాతంపైగా లాభపడ్డ బజాజ్ ఫైనాన్స్

వారాంతంలో దేశీయ స్టాక్ మార్కెట్లు దూసుకుపోయాయి. సెన్సెక్స్ 500 పాయింట్లకు పైగా లాభపడింది. 19వ తేదీ సాయంత్రం ఎగ్జిట్ పోల్స్ వెలువడనున్న నేపథ్యంలో, అనుకూల ఫలితాలు వెలువడతాయనే అంచనాలతో ఇన్వెస్టర్లు ఉత్సాహంగా ట్రేడింగ్ చేశారు. ఉదయం నుంచి చివరి వరకు సూచీలు లాభాల్లోనే పయనించాయి. ఈ నేపథ్యంలో ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 537 పాయింట్లు పెరిగి 37,931కి ఎగబాకింది. నిఫ్టీ 150 పాయింట్లు లాభపడి 11,407కి చేరుకుంది.

బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
బజాజ్ ఫైనాన్స్ (6.09), హీరో మోటో కార్ప్ (4.26), మారుతి సుజుకి (3.53), కొటక్ మహీంద్రా (3.31), బజాజ్ ఆటో (3.30).

టాప్ లూజర్స్:
యస్ బ్యాంక్ (2.36), వేదాంత (1.44), ఇన్ఫోసిస్ (1.42), సన్ ఫార్మా (0.74), టీసీఎస్ (0.62).

  • Loading...

More Telugu News