Andhra Pradesh: 19 చోట్ల రీపోలింగ్ నిర్వహించాలని ఈసీని ఎప్పుడో కోరాం.. ఇంకా స్పందించలేదు!: మంత్రి నక్కా ఆనంద్ బాబు

  • జమ్మలమడుగు, చంద్రగిరిలో రీపోలింగ్ కోరాం
  • గతంలో దశలవారీగా రీపోలింగ్ చేపట్టలేదు
  • అమరావతిలో మీడియాతో టీడీపీ నేత

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల సంఘం వ్యవహారశైలిపై ఏపీ మంత్రి, టీడీపీ నేత నక్కా ఆనంద్ బాబు అసంతృప్తి వ్యక్తం చేశారు. ఏపీలోని నరసరావు పేట, రాజంపేట, రైల్వే కోడూరు, సత్యవేడు, జమ్మలమడుగు, సత్తెనపల్లి, చంద్రగిరిలోని 19 పోలింగ్ కేంద్రాల్లో రీపోలింగ్ నిర్వహించాలని తాము ఇప్పటికే ఈసీని కోరామని తెలిపారు. అయితే తమ విజ్ఞప్తిపై ఈసీ ఇంతవరకూ స్పందించలేదని వ్యాఖ్యానించారు.

అమరావతిలో ఈరోజు నిర్వహించిన మీడియా సమావేశంలో ఆనంద్ బాబు మాట్లాడారు. ప్రస్తుతం జరుగుతున్న ఘటనలు చూస్తుంటే వైసీపీ ముందుగానే కేంద్ర ఎన్నికల సంఘంతో మాట్లాడుకుని సీఎస్ కు ఫిర్యాదు చేసినట్లు అనిపిస్తోందని అనుమానం వ్యక్తం చేశారు. గతంలో దశలవారీగా రీ-పోలింగ్ జరిపిన దాఖలాలు లేవని నక్కా ఆనందబాబు గుర్తుచేశారు. కౌంటింగ్ కు ఇంకా సమయం ఉన్నందున ఈ 19 పోలింగ్ కేంద్రాల్లో మరోసారి ఎన్నికలు నిర్వహించాలని కోరారు.

Andhra Pradesh
nakka ananda babu
ec
YSRCP
Telugudesam
  • Loading...

More Telugu News