Andhra Pradesh: ఇడుపులపాయలో వైఎస్సార్ ఘాట్ ను సందర్శించిన జగన్!

  • తండ్రికి నివాళులు అర్పించిన వైసీపీ అధినేత
  • అనంతరం హైదరాబాద్ కు పయనం
  • జగన్ వెంట అవినాశ్ రెడ్డి, ఇతర నేతలు

వైసీపీ అధినేత జగన్ ప్రస్తుతం కడప జిల్లాలో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. మూడ్రోజుల పర్యటనలో భాగంగా జగన్ ఈరోజు ఇడుపులపాయలోని వైఎస్సాఆర్ ఘాట్ కు చేరుకున్నారు. ఈ సందర్భంగా తండ్రి వైఎస్ రాజశేఖరరెడ్డికి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా జగన్ వెంట వైఎస్ అవినాశ్ రెడ్డితో పాటు పలువురు పార్టీ నేతలు ఉన్నారు. వైఎస్సాఆర్ ఘాట్ ను సందర్శించిన అనంతరం జగన్ కుటుంబ సభ్యులతో కలిసి హైదరాబాద్ కు బయలుదేరారు.

కడప జిల్లా పర్యటనలో భాగంగా నిన్న జగన్ అమీన్ పూర్ దర్గాను సందర్శించారు. ఈ సందర్భంగా వైసీపీ అధినేత ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి చాదర్ సమర్పించారు. అనంతరం దర్గా పీఠాధిపతి ఆరిఫుల్లా హుస్సేనీతో కలిసి ఇఫ్తార్ విందులో పాల్గొన్నారు.

Andhra Pradesh
Kadapa District
Jagan
YSRCP
ysr ghat
  • Loading...

More Telugu News