Telangana: తెలంగాణలో నేడు, రేపు ఈదురుగాలులతో కూడిన వర్షాలు

  • మహారాష్ట్ర నుంచి కర్ణాటక, తమిళనాడు మీదుగా ఉపరితల ద్రోణి
  • తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం
  • గురువారం సిరిసిల్లలో అత్యధికంగా 45.8 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు

మహారాష్ట్ర నుంచి కర్ణాటక, తమిళనాడు మీదుగా ఏర్పడిన ఉపరితల ద్రోణి ప్రభావంతో తెలంగాణలో నేడు, రేపు ఉరుములు, మెరుపులు ఈదురు గాలులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని పేర్కొంది. అలాగే, పగటి సమయంలో ఉష్ణోగ్రతలు కూడా ఎక్కువగా ఉంటాయని తెలిపింది. ఇక, రాష్ట్రవ్యాప్తంగా గురువారం భానుడు ఉగ్రరూపం దాల్చాడు. పలు ప్రాంతాల్లో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. సిరిసిల్ల జిల్లాల్లో అత్యధికంగా 45.8 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు అయింది. నిన్నటి వరకు రాష్ట్రవ్యాప్తంగా వడదెబ్బ కారణంగా మరణించిన వారి సంఖ్య పదికి చేరుకున్నట్టు అధికారులు తెలిపారు.

Telangana
Rains
sun
Temperature
Rajanna Sircilla District
  • Loading...

More Telugu News