Telugudesam: టీడీపీ నేతలను హెచ్చరిస్తూ మావోల లేఖ

  • అయ్యన్న, శ్రవణ్, గిడ్డి ఈశ్వరిలకు వార్నింగ్
  • కైలాసం పేరుతో లేఖ
  • రైతులను విడుదల చేయాలంటూ డిమాండ్

విశాఖ మన్యంలో మరోసారి మావోయిస్టులు తమ ఉనికి చాటుకునే ప్రయత్నం చేశారు. టీడీపీ నేతలు అయ్యన్నపాత్రుడు, గిడ్డి ఈశ్వరి, కిడారి శ్రవణ్ లను హెచ్చరిస్తూ మావోలు లేఖ విడుదల చేశారు. మావోయిస్టు ఈస్ట్ డివిజన్ కార్యదర్శి కైలాసం పేరుతో ఉన్న ఈ లేఖలో, ఇటీవల పోలీసులు అదుపులోకి తీసుకున్న ఆరుగురు రైతులను వెంటనే విడుదల చేయాలంటూ డిమాండ్ చేశారు.

ఆదివాసీల ఓట్లతో గెలిచిన మీరు ఆదివాసీల కోసం ఏం చేస్తున్నారు? అంటూ తమ లేఖలో మావోలు నేతలను నిలదీశారు. "ప్రజలను అక్రమంగా అరెస్టు చేసి చిత్రహింసలు పెడుతుంటే, ఆదివాసీలుగా ఉండి దోపిడీ వర్గాల కొమ్ముకాస్తున్నారు. ఈ విషయంలో టీడీపీ నాయకులుగా మీ ప్రత్యక్ష భాగస్వామ్యం ఉందని భావిస్తున్నాం. దీనిపై మీరు వెంటనే స్పందించి అరెస్టయిన ప్రజలను విడుదల చేయించకపోతే ప్రజలే బుద్ధి చెబుతారు" అంటూ తమ లేఖలో పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News