Jagan: జగన్ ను కలిసి ఆశీస్సులు అందజేసిన రమణ దీక్షితులు
- పులివెందుల వెళ్లిన తిరుమల మాజీ అర్చకుడు
- జగన్ తో మాటామంతీ
- పులివెందులలో జగన్ బిజీ
వైసీపీ అధ్యక్షుడు జగన్ ప్రస్తుతం పులివెందుల నియోజకవర్గంలో పలు కార్యక్రమాల్లో పాల్గొంటూ బిజీగా ఉన్నారు. రెండ్రోజుల క్రితం పులివెందుల వెళ్లిన ఆయన అక్కడ ప్రజాదర్బార్ నిర్వహిస్తూ ప్రజల సమస్యలు తెలుసుకుంటున్నారు. ఈ సందర్భంగా జగన్ ను తిరుమల మాజీ అర్చకుడు రమణ దీక్షితులు కలిశారు. ఈ సాయంత్రం పులివెందులలో జగన్ ను కలిసిన రమణ దీక్షితులు జగన్ కు ఆశీస్సులు అందించారు. రమణ దీక్షితులకు సాదర స్వాగతం పలికిన జగన్ ఆయనతో కాసేపు ముచ్చటించారు. వారిద్దరి మధ్య ప్రస్తుత రాజకీయ స్థితిగతులు చర్చకు వచ్చినట్టు తెలుస్తోంది. కాగా, పులివెందులలో ఉన్న జగన్ ను కలిసేందుకు పొరుగు జిల్లాల వైసీపీ ప్రజాప్రతినిధులు సైతం తరలివస్తున్నారు.