Congress: ‘కాంగ్రెస్’తో కలిసేందుకు జగన్ సిద్ధమన్న ప్రచారంపై ఉమ్మారెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు!

  • కాంగ్రెస్ పార్టీ నుంచి తమకు ఎటువంటి ఆహ్వానం లేదు
  • ఒకవేళ పిలిచినా ఎటి పరిస్థితుల్లోనూ వెళ్లం
  • పోలింగ్ ఏజెంట్లకు శిక్షణా కార్యక్రమంలో పాల్గొన్న ఉమ్మారెడ్డి

కేంద్రంలో కాంగ్రెస్ పార్టీతో కలిసేందుకు తెలంగాణలో కేసీఆర్, ఏపీ నుంచి జగన్ సిద్ధంగా ఉన్నారంటూ జరుగుతున్న ప్రచారంపై వైసీపీ సీనియర్ నేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీ నుంచి తమకు ఎటువంటి ఆహ్వానం లేదని, ఒకవేళ పిలిచినా ఎట్టి పరిస్థితుల్లోనూ వెళ్లమని స్పష్టం చేశారు.  

దాదాపు నాలుగు వందల మందికి శిక్షణ ఇచ్చాం

ఈ నెల 23న ఎన్నికల ఫలితాలు వెలువడనున్న నేపథ్యంలో వైసీపీ తరపున పోలింగ్ ఏజెంట్లకు శిక్షణా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా అమరావతిలోని వైసీపీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ, ఏజెంట్లకు ఎన్నికల కమిషన్ మాన్యువల్ ను వివరించామని, దాదాపు నాలుగు వందల మందికి శిక్షణ ఇచ్చినట్టు తెలిపారు. పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు వివరాలు, ఏజెంట్ల బాధ్యతలను వివరించినట్టు చెప్పారు. రౌండ్ల వారీగా తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలియజేశామని అన్నారు. ప్రజలంతా టీడీపీ ప్రభుత్వాన్ని గద్దె దించాలని నిర్ణయించుకున్నారని అన్నారు. ఓటమి భయంతోనే టీడీపీ నేతలు అసహనానికి గురవుతున్నారని విమర్శించారు.

Congress
YSRCP
ummareddy
jagan
kcr
  • Loading...

More Telugu News