mamata banerjee: సీనియర్ నాయకులను కూడా అడుగుపెట్టనివ్వడం లేదు: మమతా బెనర్జీపై శివసేన ఫైర్

  • బెంగాల్ ను యుద్ధభూమిలా మార్చేసింది
  • హింసను ప్రేరేపించిన సీపీఎంను గతంలో ప్రజలు సాగనంపారు
  • ఇప్పుడు మమతకు కూడా అదే పరిస్థితి ఎదురవుతుంది

పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ విపరీతమైన హింసకు పాల్పడుతున్నారని శివసేన మండిపడింది. అధికారం నుంచి కమ్యూనిస్టులను దించేసినట్టే మమతను కూడా ఆ రాష్ట్ర ప్రజలు సాగనంపుతారని ఆ పార్టీ పత్రిక సామ్నాలో వచ్చిన ఎడిటోరియల్ లో వ్యాఖ్యానించింది. దేశంలోని సీనియర్ నేతలను కూడా ఆమె బెంగాల్ లో అడుగుపెట్టనివ్వడం లేదని దుయ్యబట్టింది. ఆమె ప్రవర్తన చాలా దారుణంగా ఉందని... హింసను ప్రేరేపించడం ద్వారా బెంగాల్ ను యుద్ధభూమిలా ఆమె మార్చేశారని విమర్శించింది.

'మోదీ, అమిత్ షా, యోగి ఆదిత్యనాథ్ లను అడ్డుకోకుండా ఆమె ఒక్కసారి కూడా లేరు. గతంలో సీపీఎం ఇలాంటి హింసనే ప్రేరేపించింది. జనాలు ఆ పార్టీని ఇంటికి సాగనంపారు. ఇప్పుడు మమతకు కూడా అదే పరిస్థితి ఎదురుకాబోతోంది' అని సామ్నా వ్యాఖ్యానించింది.

mamata banerjee
saamna
shivsena
  • Loading...

More Telugu News